Skip to main content

ఎన్నికలు, ఓటు విలువ

ఎన్నికల నోటిసు వచ్చిన తరువాత రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కు తున్నాయి. ఎవరికి వారు తామే గెలుస్తామనే ధీమాతో వున్నారు. చిరంజీవి గ్లామర్ మరియు సంతర్పణ హామీలు, చంద్రబాబు ఎల్లలు దాటిన సంతర్పణ, రాజశేఖర్ రెడ్డి ఇదివరకే చేసివున్న సంతర్పణ లపై నమ్మకం పెట్టుకున్నారు. వీళ్ళ మాటల వరస చూస్తుంటే వీళ్ళకు ప్రజలు తమ కాళ్ళమీద తామే నిలబడడం కంటే బిచ్చగాళ్ళ లాగా అడుక్కుంటే ఎక్కువ సంతోష పడతారేమో అనిపిస్తుంది. ఎప్పుడు చూసినా అవి ఇస్తాం, ఇవి ఇస్తాం అని చెపుతుంటారు. వీళ్ళు ఎక్కడినుంచి తెచ్చి ఇస్తారు? ప్రజల డబ్బేగా?

మనం ఇంకా జమీందారీ వ్యవస్థ లో నుంచి బయటికి రాలేదని అనిపిస్తోంది. ఎంత సేపూ ఎవరో రావాలి, ఏదో ఇవ్వాలి అని కోరుకుంటాం. నిన్న ఓ టీవీ ఛానల్ లో చూపించారు... ఒకరు ఫ్రిజ్ ఇస్తే వోటేస్తాం అంటున్నారు, ఇంకొకరు మరోటి ఇస్తే వోటేస్తాం అంటున్నారు. జయప్రకాష్ నారాయణ గారి మాటలలో చెప్పాలంటే ఇప్పుడు వచ్చే ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల బడ్జెట్ ని రాబోయే ఐదేళ్ళలో ప్రవేశ పెట్ట బోతుంది. మూడు కోట్ల మంది వోటేస్తే చాలు గెలవడానికి. అంటే ప్రతి ఓటు విలువ రెండు లక్షల ముప్పై వేల పైమాటే. తమ వోటుకు ఇంత విలువ ఉందని సామాన్యులకు తెలువడం లేదు. అందుకే తమ వోటుని వందకి, రెందొందలకి అమ్ముకోవడానికి వెనుకాడడం లేదు.

విచిత్రమైన పరిస్థితి ఏమిటంటే చదువుకున్న ఆలోచనా విధానం కూడా ఏ మాత్రం ఆశా జనకంగా లేదు, కొద్ది శాతం మినహాయిస్తే. ఎమ్మెల్సీ ఎలెక్షన్లలో గ్రాడ్యుయేట్ మరియు టీచర్ల నియోజక వర్గాల్లో నిర్లజ్జగా తమ వోట్లను, డబ్బులకు, సెల్ ఫోన్లకు అమ్ముకోవడం నేను చూసాను. వోటుపై, ఎన్నికలపై ప్రతి ఒక్కరి, కనీసం మెజారిటీ ప్రజల దృక్పథం లో మార్పు వస్తే తప్ప నిజమైన ప్రజాస్వామ్యం ఏర్పడే అవకాశం లేదు. ఆ రోజు త్వరలోనే వస్తుందని కోరుకుందాం.

Comments

Popular posts from this blog

కాంగ్రెస్ గూటికి చిరంజీవి

ఎట్టకేలకు చిరంజీవి గారు కాంగ్రెస్ గూటికి చేరారు. దీనిపై ఎప్పటినుంచో ఊహాగానాలు చేయబడుతున్నా, చిరంజీవి అలా చేయరు అనే భావం కూడా అంతే బలంగా వ్యక్తం చేయబడుతూ వస్తుంది. అనుకోకుండా వచ్చిన అవకాశం రావడంతో చిరంజీవి గారు విలీనానికే మొగ్గుచూపారు. అసలు చిరంజీవి రాజకీయ ప్రవేశం కూడా ఎన్నో ఊహాగానాల తర్వాత జరిగినదే తప్ప అనుకోకుండా జరిగింది కాదు. దాదాపు 7 సంవత్సరాల క్రితమే చిరంజీవి రాజకీయ ప్రవేశం పై ఊహాగానాలు జరిగాయి. ఒక సందర్భంలో దాసరి లాంటివారు కూడా ఆహ్వానించినట్టు గుర్తు. అయితే చిరంజీవి గారు ఎటూ తేల్చకుండా చాలా రోజులు సినిమా రంగంలోనే కొనసాగారు. నిజానికి ఆయన 2004 ఎన్నికలకంటే ఒక సంవత్సరం ముందు రాజకీయాల లోకి వచ్చి ఉంటే బాగుండేది. అప్పటికి ప్రజలు చంద్రబాబు నాయుడి పనితీరుపై పూర్తిగా విసిగి పోయారు. గతానుభవాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీపై అపనమ్మకం ఉన్నప్పటికీ ప్రజలకి అంతకన్నా మించిన ప్రత్యామ్నాయం కనపడలేదు. ఈ పరిస్థితిని రాజశేఖర రెడ్డి గారు బాగా ఉపయోగించుకొని, రైతు బాంధవుడిగా  తనను తాను ప్రొజెక్ట్ చేసుకొని అధికారంలోకి వచ్చారు. బహుశా ఆ టైములో చిరంజీవి రాజకీయాలలోకి వచ్చి పార్టీని స్థాపించి ఉంటే, అప్పుడున్న ర

ఉస్మానియా బిస్కట్ల తయారీ

హైదరాబాదులో ఇరానీ హోటల్ కి వెళ్ళే వారికి ఉస్మానియా బిస్కట్లు తప్పకుండా తెలిసే ఉంటుంది. ఈ బిస్కట్లను ఇంట్లో తయారు చేయాలని ఎప్పటినుండో అనుకుంటున్నాను. ఇంటర్నెట్లో వెతికినా కూడా సరయిన సమాచారం లభించలేదు. అక్కడకొంతా, ఇక్కడ కొంతా సమాచారం సేకరించి మొత్తానికి బిస్కట్లు తయారు చేసాను. రుచి మొత్తానికి ఉస్మానియా బిస్కట్లకు దగ్గర దగ్గరగా వచ్చింది. వాటితో పోల్చుకోకుంటే మాత్రం బాగా టేస్టీగా వచ్చాయని చెప్పొచ్చు. కావాలంటే మీరు కూడా తయారు చేసుకోవడానికి కింద తయారీ విధానం ఇచ్చాను.  కావలసిన పదార్థాలు: మైదా పిండి   150 గ్రా  బియ్యం పిండి  50 గ్రా  చక్కెర   75 గ్రా  ఉప్పు  చిటికెడు  ఏలకులు  రెండు  లవంగాలు  రెండు  దాల్చిన చెక్క  ఒక ముక్క  పాలు  కలపడానికి తగినన్ని  కుకింగ్ బటర్ లేదా నెయ్యి  50 గ్రా  గ్రుడ్డు  ఒకటి (పచ్చసొన మాత్రమే) బేకింగ్ సోడా   చిటికెడు  బేకింగ్ సాల్ట్  చిటికెడు   తయారు చేసే విధానం:  ముందుగా ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క మెత్తగా నూరుకోవాలి. చక్కెర కూడా పెద్ద స్ఫటికాలుగా ఉంటే దాన్ని కూడా మెత్తగా నూరుకోవాలి. పైన చెప్పిన పదార్థాలన్నీ కలిపి పిండి మృదువుగా వచ్చె

ఎంపీలతో అధిష్టానం భేటీ, పర్యవసానం

"ఇప్పుడు సార్ మిమ్మల్ని రమ్మంటున్నారు" బంట్రోతు అరిచాడు తెలంగాణా ఎంపీలకేసి  చూస్తూ. "హమ్మయ్య", అనుకున్నారు ఎంపీలు. ఆంధ్రా ఎంపీలు పొద్దున్నే తమ కళ్ళ ముందే లోపలికి వెళ్ళారు. టిఫిన్లు, భోజనాలు లోపలే అయ్యాయి. సాయంత్రం కాఫీ కూడా అయ్యింది. వారు వెళ్లిపోయి కూడా అరగంట కావస్తుంది.  "నమస్తే సార్". అందరూ ఒకే సారి అరిచారు, లోపలికెళ్ళాక. "మీకు ఏడున్నర నిమిషాల టైం ఉంది. ఏం చెపుతారో చెప్పండి". సీరియస్ గా అంటూ పెద్దాయన సోఫా మీద పడుకున్నారు. "భిల్లూ నువ్ పనికానియ్". భిల్లూ ఉలుకూ పలుకూ లేకుండా వచ్చి సార్ కు గడ్డం గీయడం మొదలు పెట్టాడు. "అన్యాయం సార్, ఆంధ్రా వాళ్ళతో అంత సేపు మాట్లాడారు. మాకు ఏడున్నర నిమిషాలు ఇస్తే ఏం చెప్పగలం?" "మీరు లోపలికి ఎలా వచ్చారు?" "అదేంటి సార్! ఎప్పటి లాగే చేతులూపు కుంటూ వచ్చాం." "మరి వాళ్ళెలా వచ్చారు?" "వాళ్ళా, చేతుల్లో సూట్ కేసులు పట్టుకొని వచ్చారు." చెప్పారు గుర్తు తెచ్చుకుంటూ. "ఎలా వెళ్ళారు?" "చేతులూపుకుంటూ". "అర్థం అయ్యిందిగా. అదీ తేడా మీకూ