Skip to main content

కేసీయార్ అనుచిత వ్యాఖ్యలు

చంద్రశేఖర రావు ఆంధ్రా బిర్యానీని పరిహసిస్తూ వ్యాఖ్యలు చేయడం ప్రతి తెలంగాణా పౌరుడు ఖండించ దగిన విషయం. ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయాలలో కొత్త కాక పోయినా ఒక ఉదాత్తమైన ప్రజా ఉద్యమానికి శోభ నివ్వవు.

నిజానికి హైదరాబాదీ బిర్యానీకి దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. దేశ ప్రధాని, రాష్ట్రపతి విదేశీ ప్రతినిధులకు ఎప్పుడు విందులు చేసినా తప్పనిసరిగా ఉండే వంటకం హైదరాబాదీ బిర్యానీ. ప్రక్క వారి వంటకాలను తిట్టడం ద్వారా దీనికి కొత్తగా గొప్పదనం ఆపాదించవలసిన అవసరం లేదు, ఇతరులను హేళన చేయడం తప్ప.

ఈ వ్యాఖ్యలు చంద్రశేఖర రావు చేయడంలో ఆశ్చర్యం లేదు. చంద్రశేఖర రావు ఒక ఫక్తు రాజకీయ నాయకుడు. అతనికి ప్రజల్లో ఉన్న తెలంగాణా ఆకాంక్షని స్వలాభాపేక్షగా మార్చుకోవాలనే తపన ఉంది తప్ప తెలంగాణాలో ఉన్న నిజమైన పీడిత తాడిత శక్తులకు ఆయన ప్రాతినిధ్యం వహించడం లేదు.

అయితే నిద్రాణంగా ఉన్న తెలంగాణా వాదాన్ని తట్టిలేపి బలంగా వినిపించిన ఘనత కేసీయార్ కే దక్కుతుంది. కాంగ్రెస్, తెలుగుదేశం కలిసికట్టుగా తెలంగాణా వాదాన్ని చావు దెబ్బ తీయడానికి ప్రయత్నించిన నేపథ్యంలో నిఖార్సైన తెలంగాణా వాదిగా కేసీయార్ మాత్రమే తెలంగాణా ప్రజల సంపూర్ణ మద్దతు పొందుతున్నాడు. ముందు ముందు కూడా దీనిలో మార్పు వచ్చే అవకాశం లేదు. అలాంటప్పుడు కేసీయార్ కి ఇలాంటి సంకుచిత వ్యాఖ్యలు చేయ వలసిన అవసరం లేదు. కానీ కేసీయార్ గతంలో చేసిన వ్యాఖ్యలతో తాజా వ్యాఖ్యను కనుక పోల్చి చూసినట్టైతే ఇది అతని నోరును అదుపులో పెట్టుకోలేని బలహీనత గానే పరిగణించ వలసి ఉంటుంది.

ఏదైనప్పటికీ తెలంగాణా పౌరులు ఇలాంటి వ్యాఖ్యలను సమర్థించరు. ఎందుకంటే దశాబ్దాలుగా వారి భాషను, యాసను, ఆహార్యాన్ని, ఆహారాన్ని, వ్యవహారాన్ని, వివేచనను తోటి తెలుగువారు హేళన చేస్తుంటే భరిస్తూ వస్తున్న వారు కాబట్టి ఆ బాధ ఎలా ఉంటుందో వారికి బాగా తెలుసు. మనని ఇంకొకరు హేళన చేసినప్పుడు వారిని అదే విధంగా హేళన చేయాలని అనిపించడం సహజం. కానీ అది సమస్యకు సరైన పరిష్కారం కాదు. దాని వల్ల మంచికన్నా చెడే ఎక్కువగా జరుగుతుంది.

ఇప్పటికైనా కేసీయార్ ఒక ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకుడిగా కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. నాయకుడు చేసే ఇలాంటి వ్యాఖ్యల వల్ల ఉద్యమకారులకు నైతిక బలం తగ్గే అవకాశం ఉంది.

Comments

  1. ఎవఱూ ఏమీ అనకుండానే రెచ్చిపోయి అవతలివాళ్ళ మీద దుష్ప్రచారం చేసే దురుద్దేశంతో, జనం మధ్య గొడవలు పెట్టే కుట్రతో పిచ్చిగా పచ్చిగా తిట్టేస్తున్న కేసు ఇది.

    నేను స్వయంగా ఆంధ్రావాణ్ణే. అయితే గత 27 ఏళ్ళుగా హైదరాబాదులో నివసిస్తున్నాను. తెలంగాణ మాండలికాక్నీ, అహారాన్నీ వాళ్ళు ఎవఱూ విమర్శించగా నేను వినలేదు. వాళ్ళు అర్థం చేసుకుంటారు, కానీ ఆ మాండలికంలో స్వయంగా మాట్లాడ (లే) రంతే ! ఆంధ్రావాళ్ళే కుతూహలంతో తెలంగాణ వంటల్ని నేర్చుకుని మాకు వడ్డించిన సందర్భం కూడా ఒకటి చూశాను. ఆంధ్రా ఏరియాలో ఇళ్ళల్లో బిర్యానీ వండుకునే సంప్రదాయం లేదు. అసలది ఏంటో ఈ మధ్య దాకా ఎవఱికీ తెలియదు. ఆ ఏరియాలో ఉండే వంటలు ఆ ఏరియాలో ఉన్నాయి. దేశంలో 28 రాష్ట్రాలూ, 280 ప్రాంతాలూ ఉన్నాయి. భౌగోళిక పరిస్థితుల్ని బట్టి ఏ ఏరియా వంటలు ఆ ఏరియాలో ఉంటాయి. అన్నం పరబ్రహ్మస్వరూపమన్నాక ఎవఱైనా వాటిని ఎందుకు విమర్శిస్తారు ? కేసీయర్ అనడమూ, తెలంగాణవాళ్ళు గుడ్డిగా నమ్మేయడమేనా ?

    ఆంధ్రావాళ్ళు వస్తే హైదరాబాదుకొస్తారు. మిహతా తెలంగాణ జిల్లాలకెళ్ళరు. తెలంగాణలో ఏం వండుకుంటున్నారో, ఏం తింటున్నారో వాళ్ళకు తెలియదు, నిజానికి తెలంగాణ మాండలికం కూడా వాళ్ళకు తెలియదు. విమర్శించడానికీ, అపహసించడానికీ ! నాకూ తెలియదు హైదరాబాదు వచ్చేదాక తెలంగాణ మాండలికం ఒకటుందని ! దేశమంతా మా గుంటూరు తెలుగే మాట్లాడతారనుకునేవాణ్ణి. తెలియనప్పుడు ఎవఱైనా తెలంగాణ మాండలికాన్ని ఎందుకు తప్పుగా అనుకుంటారు ? ఇదంతా ఊరికే ప్రాంతీయ ద్వేషాల్ని రెచ్చగొట్టడం కోసం చేస్తున్న బుఱదజల్లుడు కార్యక్రమం. ఇది విజయవంతం కాదు.

    ReplyDelete
  2. తాడేపల్లి గారు,

    మీకు మీ అనుభవాలు ఉన్నట్టే, ఇతరులకు కూడా వారి వారి అనుభవాలు ఉన్నాయి. తెలంగాణా వారిని తాగుబోతులని, తెలివితక్కువ వారని, తెలబాన్‌లని సంబోధించడం, క్రుతకమైన తెలంగాణా భాషలో కామెంట్లు పెట్టి గేలిచేయడం ఎక్కడో ఎందుకు? మన బ్లాగావరణంలోనే చూస్తుంటాం.

    ఎవరూ కూడా ఇంకొకరి అలవాట్లను హేళన చేయకూడదనే ఈ టపా ఉద్దేశం. అది హేళనలకు ప్రతిగా నైనా సరే.

    ధన్యవాదాలు.

    ReplyDelete
  3. హరి గారు.. మంచి ప్రయత్నం...ఎవ్వరినీ ఎవ్వరూ ద్వేషించే విధంగా వుండకూడదు....!! మరి ఈ కుతంత్రాలను ప్రారంభించినది ఎవరు...!!!ఆంధ్ర వాళ్ళు దొంగలు దగాకోరులు అంటూ ప్రచారం కల్పించి విద్వేషాన్ని రగిల్చింది ఎవ్వరు? ఊరకనే కుక్కలు, పందులు ,దొంగలు అంటూంటే ఎంతకాలమని ఈవిధం గా....మీరు చెప్పండి...!!!"నోరును అదుపులో పెట్టుకోలేని బలహీనత గానే పరిగణించ వలసి ఉంటుంది." మరి అలాగే పరిగణిస్తే !!అన్నీ అంతే....

    ReplyDelete
  4. "....మీకు మీ అనుభవాలు ఉన్నట్టే, ఇతరులకు కూడా వారి వారి అనుభవాలు ఉన్నాయి.."

    కరెక్టే కానీ ఇదే మాట నిజాయితీగా తెలంగాణవాదుల క్కూడా చెప్పండి. ఆంధ్రావాళ్ళు తమ అనుభవాలతో ఎవఱి మీదా ద్వేషం వెళ్ళగక్కడం లేదు. ఆ పని చేస్తున్నది తెలంగాణవాదులు. వీరిని తెలంగాణోన్మాదులు అంటే బావుంటుంది. టూకీగా వారే తెలబాన్‌లు. అంతేతప్ప దారిన పోయే ప్రతి తెలగాణ్యుడూ తెలబాన్ కాదు.

    ఏ ప్రాంతం వెనకబాటైనా, లేదా కులం వెనకబాటైనా స్వయంకృతమే తప్ప ఇతరుల వల్ల జఱిగేది ఎప్పటికీ కాదు. అలాగే ప్రతిప్రాంతానికీ, ప్రతి కులానికీ లోపాలనేవి తప్పకుండా ఉంటాయి. ఒక ప్రాంతం వారు, లేదా ఒక కులంవారు తమ లోపాల్ని సరిదిద్దుకోకుండా పొద్దస్తమానం వాటికి ఇతరుల్ని బాధ్యుల్ని చేసి నిందిస్తున్నప్పుడు, అన్యాయంగా అభాండాలు వేస్తున్నప్పుడు సత్యం తెలిసినవారు నోరు విప్పి యథార్థంగా లోపం ఎక్కడుందో చెప్పక తప్పదు. అది ఎగతాళి చేయడమూ కాదు, వెక్కిరించడమూ కాదు. అయితే అలా చెప్పించుకునే పరిస్థితి ఎందుకు తెచ్చుకోవాలనేది నా ప్రశ్న. మనం ఇతరుల మీద ఱాళ్ళు ఱువ్వకుండా ఉంటే వాళ్లు కూడా మన మీద ఱాళ్ళు ఱువ్వకుండా ఉంటారు. రోజూ ఱాళ్ళు ఱువ్వడం, ఇతరులు వాటిని నోరు మూసుకొని భరించాలనడం తెలంగాణవాదులకే చెల్లింది. వారు చేస్తేనేమో ఉద్యమం. ఇతరులు చేస్తే నేఱం. ఏం న్యాయం ?

    ReplyDelete
  5. టపా బాగుంది. అలాగే తాడేపల్లి గారి వ్యాఖ్య కూడా బాగుంది.
    అసలు తెలుగువాళ్ళకీ బిర్యానీకీ సంబంధమేలేదు. అది ఒక ముస్లిమ్ వంటకము. రుచిగా ఉంటుంది అనుకుంటే ఎవరైనా చేసుకోవచ్చు. నిజానికి, ఆవకాయ, గోంగూరపచ్చడి, పప్పు చారు..పూతరేకులు,అరిసెలు...ఇవి అచ్చతెనుగు వంటకాలు. తెలుగు జిన్నా, తెలుగు బిన్ లాడెన్ కేసిఆర్ ఒక పొగరుబోతు మూర్ఖ శిఖామణి.

    ReplyDelete
  6. వీరిని తెలంగాణోన్మాదులు అంటే బావుంటుంది. టూకీగా వారే తెలబాన్‌లు.

    అలా అన్న ప్రతీచోటా disclaimer ఇవ్వడం లేదుగా? ముందు అని తర్వాత ఎలా ఐనా భాష్యం చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా మీరు తెలంగాణా వాదులందరినీ కలిపి వేస్తున్నారు. స్నేహ పూర్వకంగానే విడిపోవాలని కోరుకునే తెలంగాణా ప్రజలు ఎంతో మంది ఉన్నారు. మరి మీరు చెప్పింది తెలంగాణా వాదుల విషయంలో కూడా వర్తిస్తుంది కదా? వారు చెప్పేదీ అదేగా? వారు ద్వేషిస్తుంది ఆంధ్రా నుంచి వచ్చి దోపిడీ చేస్తున్న కొంతమంది పెట్టుబడీ దారులనే నని ఎన్నో సార్లు వివరించారు. అలాంటి దోపిడీదారుల గురించి తెలంగాణాలోనే కాదు, ఆంధ్రాలో కూడా మాట్లాడుతున్నారు. లగడపాటి రచ్చబండ ఉదంతం తాజా ఉదాహరణ.

    ఏ ప్రాంతం వెనకబాటైనా, లేదా కులం వెనకబాటైనా స్వయంకృతమే తప్ప ఇతరుల వల్ల జఱిగేది ఎప్పటికీ కాదు.

    ఒక విధంగా స్వయంకృతమే. అన్ని ఒప్పందాలు ఉల్లంఘించ బడుతున్నా ఇన్నాళ్ళూ ఏమారడం.

    ReplyDelete
  7. వూరకుక్క ఉచితానుచితము లెరిగి కూతలిడునా?

    ReplyDelete
  8. తెలంగాణ ఉద్యమంలో దోపిడి అనే మాట చాలా తఱచుగా వాడుతున్నారు. వింటున్నాను. దీనర్థం కరెక్టుగా ఏంటో ఎవఱైనా సెలవిస్తారా ?

    ఒకే దేశంలో నివసించేవారు ఒకఱి ప్రాంతాలకు ఇంకొకఱు వెళ్ళడం, ఉండడం దోపిడియా ? ఒక ప్రాంతం వారు ఇంకో ప్రాంతంలో ఇల్లు కట్టుకుంటే అది దోపిడియా ? ఒక ప్రాంతం వారు ఇంకో ప్రాంతంలో షాపులు పెడితే, వ్యాపారం చేస్తే, ఆఫీసులు నెలకొల్పితే అది దోపిడియా ?

    ఆ లెక్కన మఱి విదేశాలలో చదువుకుంటున్న తెలంగాణ ఎన్నారైలు ఆ దేశాల్ని దోచుకోవడం లేదా ? అక్కడ ఉద్యోగాలు చేస్తున్న తెలంగాణవారు ఆ దేశపౌరుల ఉద్యోగావకాశాల్ని హరించడం లేదా ? షోళాపూరుకు ఒక తెలగాణ్యుడు మేయర్ గా ఉన్నాడు. తెలంగాణవాదుల సిద్ధాంతం ప్రకారం అది తప్పు కదా ? ఒక మహారాష్ట్రియన్ కి దక్కాల్సిన పదవిని తెలంగాణవాడు అనుభవించొచ్చునా ? మఱి ఆయన షోళాపూర్‌ని దోచుకుంటున్నట్లే కదా ? ఇప్పటికిప్పుడు టి,.ఆర్.ఎస్. తరఫున ఒక పంజాబీ సిక్ఖు సెటిలర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మఱి అతను తెలంగాణ అవకాశాల్ని దోచుకుంటున్నట్లే కదా ? అంటే పంజాబీ సిక్ఖులు కూడా తెలుగ్గడ్డ అయిన తెలంగాణలో హాయిగా ఉండనూ వచ్చు, కమ్మగా సంపాదించుకోనూ వచ్చు. ఎమ్మెల్యేలూ కావచ్చు. కానీ ఎవఱికీ లేని నీతులూ, నియమాలూ ఆంద్ర్రోల్లకే ఉండాలి. తెలుగోళ్ళయిన ఆంద్రోల్లకు మాత్రం తెలంగాణలో పచ్చిమంచినీళ్ళు పుట్టకూడదు, రాష్ట్రం సమైక్యంగా ఉన్న సమయంలో నైనా సరే ! ఏం న్యాయం ? ఏం వివేకం ?

    మఱి ఆ లెక్కన మజగాఁవ్ డాక్స్ లో రు. 600 కోట్లు పెట్టుబడి పెట్టిన కేసీయార్ గుజరాత్ ని దోచుకుంటున్నట్లు కాదా ? వీనస్ పవర్ పేరుతో శ్రీకాకుళంలో విద్యుత్ కర్మాగారాన్ని నెలకొల్పుతున్న గుడిసెల వెంకటస్వామి ఉత్తరాంధ్రను దోచుకుంటున్నట్లు కాదా ? నిజామాబాద్ కు చెందిన డి.శ్రీనివాస్ విజయవాడను దోచుకుంటున్నట్లు కాదా ?

    ఈ మాట (దోపిడి) ఒకప్పుడు ఇంగ్లీషువాళ్ళ గుఱించి వాడేవారు. స్వదేశీయుల మీద వాడ్డం ఏమైనా బావుందా ? మీ మనస్సాక్షిని అడిగి చూడండి.

    ReplyDelete
  9. తాడేపల్లి గారు,

    దోచుకోవడం గురించి ఇప్పటికే పలు సందర్భాల్లో వివరణ ఇవ్వడం జరిగింది.

    తెలంగాణా వారికి ఆధ్రానుండి వచ్చి ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్న వారిపై ఎలాంటి వ్యతిరేకరత లేదు. అయితే నియమ నిబంధనలను తుంగలో తొక్కి తమవి కాని ఉద్యోగాల్లో అక్రమంగా దూరిన వారిపై మాత్రం అభ్యంతరం ఉంది.

    ఆంధ్రా నుండో మరో ప్రదేశం నుండో వచ్చి సక్రమంగా వ్యాపారం చేసుకునే వారిపై అభ్యంతరం లేదు. అక్రమంగా ఇక్కడి భూములు ఆక్రమించే వారిపట్ల (Ex: భాను, సూరి etc), ప్రకృతి సంపదను నాశనం చేసే వారి పట్ల (Ex: కొత్తగూడా అడవి భూమి), ప్రభుత్వంలో మెజారిటీ ఉంది కదా అని ప్రభుత్వ నిధులని దారి మల్లించే వారిమీద (Ex: NABARD), భూములు ఆక్రమించే వారిమీద (Ex: Laanco Wakf lands) మాత్రం అభ్యంతరం ఉంది.

    నిజానికి ఈ ప్రాంత వాసులు ఎంతో స్నేహ శీలురు కాకపోతే, ఇక్కడ ఇంతమంది వచ్చి (అది కూడా తమ సంస్కౄతిలో ఏమాత్రం మార్పు లేకుండా,) నివసించ గలిగి ఉండేవారే కాదు. కానీ ఆ స్నేహ శీలతని కొంత మంది చేతగాని తనంగా భావించారు. అందుకే ఉద్యమం.

    ఇక్కడ సింధీలు, మార్వాడీలు, గుజరాతీలు, మరాఠీలు, సిక్కులు, పార్సీలు, వగైరా నివసిస్తున్నారు. కాని వారెవ్వరూ ఇక్కడి ప్రభుత్వంలో చక్రం తిప్పుతూ వారికి అనుకూలంగా ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చేయడం లేదు.

    ReplyDelete
  10. ప్రకృతిసంపద అన్నిచోట్లా నాశనం చేయబడుతున్నది. కేవలం తెలంగాణలోనే కాదు. పారిశ్రామిక కాలుష్యం ఎక్కువై విశాఖపట్నంలో ఆమ్లవర్షాలు పడుతున్నాయి.

    నాబార్డులాంటి సంస్థల విషయానికొస్తే ఆ సమయపు అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాలకు కేటాయిస్తారు. ఒకసారి తెలంగాణకొస్తాయి. ఇంకోసారి ఆంధ్రాకొస్తాయి. అదో పెద్ద ఇష్యూ కాదు. తీసుకున్నప్పుడు బాగా తీసుకొని ఇంకో ప్రాంతానికి కేటాయింపులు జఱగంగానే "అదిగో తెలంగాణకు అన్యాయం" అని అఱవడం ఈ మధ్యనే మొదలైంది.

    చక్రం తిప్పడం - తమ స్వరాష్ట్రంలో ఎవఱైనా చక్రం తిప్పుతారు. తప్పేంటి ? తెలంగాణవారు తిప్పడంలేదా ? ఒకవేళ తిప్పలేకపోతే అది వాళ్ళ తప్పు. ఎప్పుడూ తెలంగాణ మీదనే ఇతరులు వచ్చిపడిపోతున్నారని భావించడం దేనికి ? తెలంగాణవారు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్ళడం లేదు ? ఆ లోపం తెలంగాణవారిదా ? ఇతరప్రాంతాలవారిదా ? తెలంగాణవారికి మొబిలిటీ లేకపోతే అది ఇతరులక్కూడా ఉండకూడదా ? మొబిలిటీ లేకపోవడం ఈ రోజుల్లో నిజంగానే చేతకానితనంగా భావించబడుతుంది.

    తెలగాణ్యుల అవగాహనలో లోపం ఎక్కడున్నదంటే తెలంగాణని తెలగాణ్యులు తమ తాత జాగీరులా భావిస్తున్నారు. తెలంగాణ ఒక బృహత్ తెలుగులోనూ, దాని తరతరాల హోమ్‌ల్యాండ్ అయిన ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇండియాలోనూ ఒక భాగమని వారు తఱచుగా మర్చిపోతూంటారు. తెలంగాణ మీద వారికెంత హక్కుందో ఆంధ్రావారికీ, తతిమ్మా భారతీయులకీ తెలంగాణ మీద అంతే హక్కుంది. అంతే బాధ్యత కూడా ఉంది. అదే విధంగా తెలంగాణక్కూడా ఆంధ్రప్రాంతపు యావత్తు వనర్లమీదా, భూమి మీదా చట్టబద్ధమైన హక్కుంది. ఏ హక్కూ లేకపోతే అక్కడి గ్యాస్ ని ఇక్కడి పట్టణాలకు సరఫరా చేయాలని రాష్టప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకుంటుంది ? తమ హక్కుని ఆంధ్రావారు సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు. తెలంగాణవారు తమ మానసిక పరిమితుల కారణంగా అలా చేసుకోలేకపోతున్నారు. తప్పెవఱిది ? అందుకే తెలంగాణ వెనకబాటు పూర్తిగా self-imposed అంటున్నాం. అందులో ఎవఱి అణచివేతా లేదు, ఎవఱి కుట్రా లేదు. తెలంగాణ తన అవగాహనాలేమితో తన మీద తానే కుట్ర చేసుకుంది.

    ReplyDelete
  11. ప్రకృతిసంపద అన్నిచోట్లా నాశనం చేయబడుతున్నది. కేవలం తెలంగాణలోనే కాదు.

    అక్కడ చేయబడుతుందనేది ఇక్కడ చేస్తున్న దానికి సమాధానం కాదు.

    నాబార్డులాంటి సంస్థల విషయానికొస్తే ఆ సమయపు అవసరాన్ని బట్టి ఆయా ప్రాంతాలకు కేటాయిస్తారు

    ప్రతీ విషయంలో ఇలాంటి మాటలే చెప్పొచ్చు. ఆ అవసరాలేమిటో తెలియజెప్పితే బాగుందేది. 120 కోట్లలో 9 కోట్లు తెలంగాణాకి, 111 కోట్లు ఆంధ్రాకి కేటాయిస్తే ఏమనుకోవాలి? తెలంగాణా యూనివర్సిటీకి 2.5 కోట్లు, కడప యూనివర్సిటీకి 250 కోట్లు ఇవ్వడం కూడా అవసరాన్ని బట్టే అంటారా?

    చక్రం తిప్పడం - తమ స్వరాష్ట్రంలో ఎవఱైనా చక్రం తిప్పుతారు. తప్పేంటి ? తెలంగాణవారు తిప్పడంలేదా ?

    తిప్పడం లేదు. లేరు కూడా. ఒక వేళ చచ్చీ చేదీ ఎవరైనా CM అయినా కూడా మెజారిటీ ఉన్న సీమాంధ్ర వారి మీదనే ఆధార పడాలి. కేంద్రంలో మన్‌మోహన్‌సింగుకి ఎన్ని హక్కులున్నాయో ఇక్కడ వీళ్ళకు అన్నే హక్కులుంటాయి.

    ఒకవేళ తిప్పలేకపోతే అది వాళ్ళ తప్పు.

    వారి తప్పు కాదు, పై కారణాల వల్ల. ఈ పార్లమెంటరీ విధానంలో మెజారిటీ ఉన్న సీమాంధ్రుల మీద వారు ఎన్నటికీ పైచేయి సాధించ లేరు.
    తెలంగాణా నాయకులకంటే ఆంధ్రా నాయకులేమీ గొప్ప వారు కాదు. అంతా ఆ తానులోని ముక్కలే. కాని మెజారిటీ రాజకీయాల వల్ల ఆధిపత్యం సాధించ గలుగుతున్నారు.

    తెలంగాణవారు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు ఎందుకు వెళ్ళడం లేదు ? ఆ లోపం తెలంగాణవారిదా ? ఇతరప్రాంతాలవారిదా ? తెలంగాణవారికి మొబిలిటీ లేకపోతే అది ఇతరులక్కూడా ఉండకూడదా ?

    ఎందుకు వెళ్ళడం ళేదు? తెలంగాణా వారు పరాయి రాష్ట్రాల ప్రాంతాలైన భీవాండి, సూరత్, ముంబై, అహ్మదాబాద్, సూరత్ మొదలైన ప్రాంతాలకు వలస వెళ్ళి పొట్ట పోసుకుంటున్నారు. పరాయి దేశాలైన సౌదీ, ఖతర్, దుబాయ్, షార్జా లకు ఆస్తులు తాకట్టు పెట్టుకుని మరీ వెళ్తున్నారు. మరి వారు ఆధ్రాకి ఎందుకు వెళ్ళ లేక పోతున్నారో ఆ ప్రాంతం వారే ఆలోచించుకోవాల్సి ఉంటుంది.

    తెలగాణ్యుల అవగాహనలో లోపం ఎక్కడున్నదంటే తెలంగాణని తెలగాణ్యులు తమ తాత జాగీరులా భావిస్తున్నారు.

    ఇది మా తాతల జాగీరే.

    తెలంగాణ ఒక బృహత్ తెలుగులోనూ, దాని తరతరాల హోమ్‌ల్యాండ్ అయిన ఆంధ్రప్రదేశ్ లోనూ, ఇండియాలోనూ ఒక భాగమని వారు తఱచుగా మర్చిపోతూంటారు.

    పొరబాటు. తెలుగు భాష ఒకటి కావచ్చు. కాని మనం వేరువేరే. 1956కి ముందు మొత్తం ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ ఒక్కటిగా లేదు. చరిత్ర చదవండి. ఒక వేళ మధ్యలో అప్పుడప్పుడు కలిసి ఉన్నా ఇతర తమిళ ప్రాంతాలో, కన్నడ ప్రాంతాలో మరాఠీ ప్రాంతాలో కూడా కలిసి ఉన్నాయి. లేదా కొన్ని ప్రాంతాలు వేరుగా ఉన్నాయి. ఇప్పటి ఆంధ్రప్రదేశ్ రూపంలో ఎప్పుడూ లేదు.

    తమ హక్కుని ఆంధ్రావారు సద్వినియోగం చేసుకోగలుగుతున్నారు.

    ఎందుకు చేసుకోరూ? కారణాలు పైనే చెప్పుకున్నాంగా.

    తెలంగాణవారు తమ మానసిక పరిమితుల కారణంగా అలా చేసుకోలేకపోతున్నారు. తప్పెవఱిది ?

    ఈ వ్యాఖ్య మీరు వెనక్కి తీసుకుంటే మంచిది. ఈ వ్యాఖ్య చేసిన తర్వాత మీకు సమైక్యంగా ఉందామనే హక్కు ఉండదు. కేసీఆర్ లాంటి వారు తిట్టిన వంద తిట్ల కన్నా ఇది మహా దుష్ట పూరితమైన వ్యాఖ్య.

    తెలంగాణ తన అవగాహనాలేమితో తన మీద తానే కుట్ర చేసుకుంది.

    దయచేసి మా అవగాహనా శక్తిపై మీరు తీర్మానం చేసే పద్ధతి మానండి. మా అవగాహనా లోపం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ఒప్పుకోవడమే. అది కూడా 55 సంవత్సరాల క్రితం, ఇప్పుడు కాదు. పైగా షరతులతో.

    మీరు మాకు చేయగలిగిన సహాయం ఒక్కటే. మా న్యాయబధ్ధమైన కోరికకి మోకాలడ్డ కుంటే చాలు. మీరు మోకలడ్డిన, మొత్తంగా అడ్డం తిరిగినా తెలంగాణా రాష్ట్రం ఆగదు. మధ్యంతర ఎన్నికలు రాకపోయినా 2014లో జరిగే ఎన్నికలలో చారిత్రాత్మకమైన మార్పు జరుగుతుంది. దానికి పునాది మొన్నటి ఉప ఎన్నికలలోనే పడింది.

    ధన్యవాదాలు.

    ReplyDelete
  12. కెసిఆర్ తన స్థాయికి తగ్గ, ఎప్పటిలానే ప్రవర్తించాడు. అన్ అలగా జనాలు అలాంటి అలగా జోకులు ఇష్టపడతారు, మరి. నాకు నవ్వు, ఆశ్చర్యం వేసిందేమంటే విజయవాడ అమ్మలక్కలు దానికి టివి9లో నిరసన తెలిపినట్టు చూపించడం, అబ్రకదబ్ర రాసిన వ్యంగ్య కథకు తెలబాన్లు వచ్చి నిరసన తెలపడం. శ్రీకృష్ణ రిపోర్ట్ తరువాత, కేంద్ర మంత్రివర్గ విస్తరణ వార్తల మధ్య కెసిఆర్ రెస్పాన్స్ పలచబడి పేలవంగా, సీరియస్ నెస్ తగ్గినట్టు వుంటోంది. తెలగాణ అజిటేషనే ఓ ఫార్స్, బ్లాక్మెయిల్ రాజకీయం అని అందరూ అనుకున్నట్టే జరుగుతోంది. కెసిఆర్, చెన్నారెడ్డి-2 అన్నది సుస్పష్టం.

    ReplyDelete
  13. >>మా కోరికకి మోకాలడ్డ కుంటే చాలు. మీరు మోకలడ్డిన, మొత్తంగా అడ్డం తిరిగినా తెలంగాణా రాష్ట్రం ఆగదు.

    మోకాలడ్డటమే కాదు, మీ గొంతెమ్మ కోరికల్ని మోకాలులోతున పాతి పెడతాం. ఎట్లాగూ తెలంగాణ వస్తుంది అంటూ ఈ దేబరింపులెందుకు, తెచ్చుకోండి. జుట్టు, కాళ్ళు పట్టే రాజకీయాలు అవసరంలేదు, వుద్యమాలు చేస్తున్నారుగా! కాకా కూడా దళిత ముఖ్యమంత్రి పదవికి తయారవుతున్నాడు, ఇక మీదే ఆలిశ్యం.

    ReplyDelete
  14. కోరికల్ని మోకాలులోతున పాతి పెడతాం.

    మీలాంటోల్లకు నేను కాదు, కేసీయారే కరెక్టు. అననిమస్ ముసుగెందుకు? రా, మాట్లాడుకుందాం.

    ReplyDelete
  15. హరి గారూ,
    కేసీఆర్ బాషను మీరు ఖండించడాన్ని నేను స్వాగతిస్తున్నాను. ఇలాంటి భాష వల్లే పరిస్థితి ఇంతవరకూ వచ్చింది. ఏమన్నా అంటే తెలంగాణ భాష ఇంతే అంటాడు.. నా తెలంగాణ మిత్రులెవరూ అలాంటి భాష మాట్లాడటం నేను వినలేదు..
    ఇక తెలంగాణ ప్రజలు కోరుకుంటే తెలంగాణ ఏర్పాటు కావాల్సిందే.. అందుకు ఏ రకమైన కారణాలు అవసరం లేదు.. ఇబ్బంది ఏమిటంటే, ఆంధ్రా ద్వేషం తో ఒక ఉద్యమాన్ని నిర్మించడం..
    మీరెక్కడ ఉంటారో నాకు తెలీదు కానీ మా ఊర్లో తెలంఘాణ సైడు వాళ్ళతో పెళ్ళి సంభంధాలు చేసుకోవాలంటే భయపడుతున్నారు.. ఇలాంటి దురదృష్టకర పరిణామం అవసరమా?
    ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటంటే, ఒక ఐదు పదేళ్ళల్లో తెలంగాణ ఇస్తామని పార్లమెంటులో బిల్లు పెట్టి ఆ మధ్య కాలంలో మిగిలిన చోట్ల కూడా హైదరాబాద్ లాంటి రాజధానులను నిర్మించాలి.. ఈ మొత్తం యజ్ఞం పారదర్శకంగా జరిపేటందుకు ఒక రాష్ట్రపతి ఆధీనం లో ఒక బోర్డును ఏర్పాటు చెయ్యాలి.. ఎందుకంటే ప్రజల మధ్య మానసిక దూర, బాగా పెరిగింది.. హైదరాబాదులో వీధిపోరాటాలను నివారించాలంటే ఇంతకంటే మార్గం కనిపించడం లేదు..
    the division of state looks inevitable and action is needed to ensure that going forward man-to-man relations b/n the two regions remain smoother..

    -Karthik

    ReplyDelete
  16. i was thinking the SKC will come to such conclusion but seems their scope is totally different.

    ReplyDelete
  17. మీ తలాతోక లేని మాటలు, వాదనలు చూశాను. తాడేపల్లి గారు రాసీందాన్నే తిరిగి ఎదురు రాయడమేగా మీ వాదన, స్వంతంగా ఒక్క మాట అర్థవంతంగా మాట్లాడారా? చెప్పిన అపద్దాలన్నీ శ్రీకృష్ణ రిపోర్ట్తో ఆవిరైపోగా ఇప్పుడు మళ్ళీ 'న్యాయమైన కోర్కె ' అని కాళ్ళబేరానికి రావటం ఆత్మగౌరవం అనిపించుకోదు.

    ReplyDelete
  18. కార్తీక్ గారు,

    ధన్యవాదాలు.

    తెలంగాణా రాష్ట్రాన్ని కోరిన్నత మాత్రాన నేను ఆంధ్రా ప్రజలకు వ్యతిరేకం కాదండీ. నిజానికి నా మిత్రుల్లో ఎక్కువ మంది ఆంధ్రా వారే. వారంతా మనంచి family friends కూడా. ప్రస్తుత వ్యవస్థలో ప్రజల మధ్య సాన్నిహిత్యం పెరగాలంటే రాష్ట్రాన్ని విభజించడం ఒక్కటే మార్గం.

    అసలు విభజనకంటూ రెండు ప్రాంతాల వారు సిద్ధమైతే పరిష్కారం తప్పక దొరుకుతుంది. అది మీరు చెప్పిందే కావచ్చు. ఒకరు విభజన అంటే ఇంకొకరు సమైఖ్యాంధ్ర అనడం వల్ల ఇది రావణ కాష్టంలా కొనసాగుతూనే ఉంటుంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది. ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది.  పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే. ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు. ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు. నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులు...

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...