Skip to main content

ICICI బ్యాంకులో నా అనుభవం

క్రమంగా ప్రైవేటు రంగ సంస్థలు భారత దేశంలో ముందంజ వేస్తుంటే సంతోషించిన వాళ్ళలో నేను ఒకడిని. ఒకప్పుడు జాతీయ బ్యాంకులో DD తీయాలంటే గంటలకొద్దీ సమయం పట్టేది. అదే నిమిషాల్లో ప్రైవేటు బ్యాంకుల్లో ఇచ్చేస్తుంటే ముచ్చటేసేది. అయితే ఈ ప్రైవేటు బ్యాంకులు ఎంత ఘరానా గా దోపిడీ చేయ గలవో అనుభవం మీద తెలిసింది.

మూడు సంవత్సరాల క్రితం నేను 9 లక్షలు గృహ ఋణం తీసుకున్నాను మారే వడ్డీ విధానం పై. అప్పుడు వడ్డీ 9.00 శాతంగా వుండేది. ఈ మూడు సంవత్సరాల్లో వాయువేగ మనో వేగాలతో వడ్డీ రేటు 13.00 శాతానికి పెంచారు. సరే రేపో రేటు పెరిగింది కాబట్టి పెంచారులే అనుకుంటే మిగతా బ్యాంకుల కన్నా చాలా ఎక్కువగా. ఇక వాయిదాలను చూస్తే జీవితాంతం కట్టినా ఇంకా మిగిలేలా పెంచేశారు, అలాగే వాయిదా మొత్తం కూడా. రేపో రేటు తగ్గిన తర్వాత కుడా చాలా కాలం మిన్నకుండి కేవలం అర శాతం తగ్గించి 12.5 శాతం చేసారు.

ఇక ఇలా కాదని కొంత మొత్తం తీర్చేద్దామని రెండున్నర లక్షలు పట్టుకుని బ్యాంకుకి వెళ్లాను. బేగంపేటలో వీరికి ఒక కస్టమర్ రిలేషన్ సెంటరు ఒకటి వుంది. అక్కడికే వెళ్లాను. మామూలుగా నైతే అన్ని లావా దేవీలు counter లోనే జరుపుతారు. కాని ఆశ్చర్యకరంగా నన్ను లోపలి గదిలోకి తీసుకెళ్ళారు. అక్కడ మొదలయింది అసలు కథ.

నేను ఇప్పుడు ఉన్న రేటుకి part payment చేస్తే ఎంత నష్టపోతానో వివరించారు. దానికి మార్గాంతరం కూడా ఉపదేశించారు. నేను ఒకవేళ ICICI Prudential లో 30000 ల రూపాయలు జమచేస్తే నేను ఇప్పుడున్న రేపో రేటుకి మారడానికి సహాయం చేస్తారు. అది కూడా రూపాయలు 16200 అదనంగా చెల్లిస్తే. అప్పుడు నా వాయిదాలు గణనీయంగా తగ్గుతాయి. నేను ICICI Prudential లో చేరను, కాని స్విచింగ్ కోసమై 16200 చెల్లిస్తాను, వడ్డీ తగ్గించండి అని అడిగాను. అది వీలు కాదు అని చెప్పారు.

నాకు బ్యాంకింగు వ్యవహారాలు అంతగా తెలియవు. బహుశ ICICI వారు అంతా సరిగానే చేస్తుండ వచ్చు. కాని నాకు ఇందులో నచ్చని విషయం ఒకటే. గృహ రుణానికి సంబధించిన వడ్డీని ఇన్స్యురెన్సుతో ముడి పెట్టడం ఏమిటి? చుట్టూ చూస్తే ఇలా గృహ రుణ కబంధ హస్తాల నుండి తప్పించు కోవడానికి అక్కడ నాలా చాలా మందే కనిపించారు. అంతా ICICI బ్యాంకుని తిట్టుకుంటూ ఇన్స్యురెన్సు చేస్తున్నారు. చివరకు నేను కుడా విధి లేక అదే పని చేశాను.

ఎందుకు ఇలా చేశాను అని ఆలోచిస్తే... బ్యాంకుల నిబంధనలు పరిశోధించే ఓపిక లేదు. బ్యాంకు చుట్టూ మళ్ళీ మళ్ళీ తిరిగే తీరిక లేదు. అయినా ఇన్సురెన్సె కదా మన డబ్బులు మనకే ఉంటాయిలే, చేస్తే ఏం పోతుంది అన్నా భరోసా. సరిగ్గా ఇలాంటి సైకాలజీయే కావాలేమో మన బ్యాంకర్లకి!

Comments

  1. "గృహ రుణానికి సంబంధించిన వడ్డీని ఇన్స్యురెన్సుతో ముడి పెట్టడం ఏమిటి? " -ఇది మీరు సరిగా అర్థం చేసుకుని రాసిన విషయమేనా? మీ అప్పుకి Collateral security మీరు కొన్న గృహమైతే, ఆ ఇంటికి చేస్తున్న ఇన్సూరన్స్ కావచ్చు అది.

    ReplyDelete
  2. దీనికి గృహ భీమాతో సంబంధం లేదు. నాకు అంట గట్టింది Life stage pension అనబడే ఒక పథకం.

    ReplyDelete
  3. వారు తమ భీమా పథకాల గురించి మార్కెట్ చేసుకోవడం పై నాకెలాంటి అభ్యతరం లేదు. ఎటొచ్చి పాత గృహ రుణానికి సంబధించిన వడ్డీ రేటు సవరించడానికి, భీమాలో చేరటానికి లంకె పెట్టడమే నాకు తప్పుగా తోచింది. ఈ విధంగా వడ్డీ సవరించు కోవాలని వెళ్ళే రుణ గ్రహీతలు తప్పని సరి పరిస్థితులలో భీమా ఖాతాలు కుడా తెరవాల్సి వస్తుంది. నా పాయింటు ఏమంటే ఒక వేల వడ్డీ సవరింపు మాములుగా సాధ్య పడనప్పుడు భీమా పథకం లో చేరిన తర్వాత ఎలా సాధ్యపడుతుంది? ఇది ఒక రకమైన blackmail తప్ప మరోటి కాదు.

    తిడితే మాత్రం ప్రయోజనం ఏముంటుంది, అక్కడ ఉండేది ఉద్యోగస్తులేకదా?

    ReplyDelete
  4. Bankers say that since we have already paid so much in the past years as interest, we lose the previously paid interest if we do part payment. But it is not true. What ever we pay as part payment will be exactly equivalant to the sum of the present values of our future payments for the same principal.

    Either you deposit 2 laks at once or you deposit all the futue EMIs every month(for that 2 laks) with same interest rate, after the tenure it should be same.

    However public sector banks are much better than private banks in many aspects. Private banks minimum balance requirement is too high that poor people cannot afford. Private banks would charge a lot for services like Demand Draft. Private banks would not open branches in rural areas and offer loans for farmers etc. However due to private banks, compitition increased and services in public sector banks improved.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

తెలుగును పునరుజ్జీవింప జేద్దాం

భాష బలంగా ఉందా, బలహీన పడుతుందా అని తేల్చడానికి ఆ భాషకు ఉన్న పద సంపదే కొలమానం. అన్ని భాషలలో పదజాలం రోజు రోజుకు పెరుగుతుంటే మన తెలుగు భాషలో మాత్రం వాటి జాగాలో ఇంగ్లీషు పదాలు వచ్చి చేరుతున్నాయి. కొంత మంది ఔత్సాహికులు కొత్త కొత్త తెలుగు పదాలను సృష్టించడానికి ప్రయత్నించడం అభినంద నీయమే అయినా అవి ఎంతవరకు ప్రజల్లోకి వెళ్తున్నాయి అనేది కూడా ఆలోచించ దగ్గ విషయం. ఎక్కువ మంది కొత్త పదాలను సృష్టించ దానికి క్లిష్టమైన సంస్కృత సమాసాలను వాడుతున్నారు. దీనివల్ల ఒక భాష నుండి వేరొక భాషకు దాసోహం చెప్పడం తప్ప అసలు సమస్య పరిష్కారం కాదు. సంస్కృతం తన సహజరూపం లోనే మన లేక హిందీగా మారి ఉత్తర భారతంలో బ్రతుకుతుంది. అలాంటి సంస్కృత పదాలను అరువుతెచ్చుకుని తెలుగులో వ్యాప్తిలోకి తీసుకు రావాలనుకోవడం అత్యాశే అవుతుంది. అవసరం లేదు కూడా. మన భాష ప్రస్తుత పరిస్థితికి ప్రబంధ సాహిత్యం తప్ప, సాంకేతిక పరమైన సాహిత్యం మనకు లేకపొవడం కూడా కొంతవరకు కారణమేమో అనిపిస్తుంది. పైగా మన పూర్వ కవులకు సంస్కృతం పై ఉన్న ఎనలేని మోజు కూడా ఈ పరిస్థితికి కొంత వరకు కారణం. అర్జునుడికి వంద పేర్లు ఉంటాయి. irrigation అనే పదానికి ఒక్క తెలుగు ...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...

కడప ఎన్నికలతో రాష్ట్ర భవితం తేలనుందా?

కడప పార్లమెంటు, అసెంబ్లీ నియోజక వర్గాలలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును తేల్చేవిగా కనబడుతున్నాయి. అందుకే ముఖ్యమంత్రి, ఆయన సహచర మంత్రులు సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతున్నారు. ఒక వైపు రాజశేఖర్ రెడ్డికి పెట్టని కోట లాంటిదైన జిల్లా. పైగా జగన్ కున్న ధనబలం, అంగబలం. కాంగ్రెస్ ధనబలం, అధికారబలం. వీటి మధ్య ఎంత తీవ్రమైన పోరు జరిగినా కూడా, జగన్ కే విజయావాకాశాలు లభించే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ఎలక్షన్ లో ఓటమి గాని సంభవిస్తే జగన్ పార్టీకి అది సమాధిగా మారుతుంది. ప్రజారాజ్యం పార్టీలా ఇతర పార్టీల్లో కలవడం తప్ప, మళ్ళీ కుదురుకోవడం కష్టం కావచ్చు. ఆ పక్షంలో కాంగ్రెస్ జగన్ని మరింత అణగదొక్కడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి BJP లో కలవ వచ్చు. కడపలో గెలిస్తే రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం 2014 వరకు తిరుగుండదు.  ఒక వేళ ఈ ఎన్నికల్లో జగన్ గనక గెలిచినట్టయితే అది రాష్ట్ర ప్రభుత్వానికే కాక, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి కూడా గొడ్డలి పెట్టుగా మారుటింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కూల్చడానికి జగన్ ఒక్క నిముషం కూడా వృధా చేయడు. కాంగ్రెస్, తెలుగుదేశాల నుండి జగన్ పార్టీకి జోరుగా వలసలు ప...