Skip to main content

తెలంగాణా

కాకతీయుల కాలంలో సుభిక్షమైన పరిపాలనకు నోచుకున్న తెలంగాణా తరువాత నవాబుల పాలనలోకి వచ్చింది. నాలుగు వందల సంవత్సరాల పాటు నిజాం కర్కశ పాలనకు కాకా వికలమైంది తెలంగాణా. నిజాం, అతని తాబేదార్లైన దేశ్ ముఖ్ లు, దొరలు, జమీందారులు, జాగీర్దారులు తెలంగాణా ప్రజల ధన మాన ప్రాణాలను, కష్టాన్ని ఇష్టం వచ్చినట్టు దోచుకున్నారు. తెలంగాణా లో వీరు అమలు జరిపిన 'వెట్టి చాకిరీ', రోమన్ ల కాలం లోని బానిసత్వం కన్నా క్రూర మైనది. బానిసలకు కూడు పెట్టి పని చేయిస్తారు. కాని ఇక్కడ పని మాత్రమె చేయించుకునే వారు, కూడు ఎవరికీ వారే చూసుకోవాలి. ఎలాంటి ప్రతిఫలం లేకుండా ప్రతి ఇంటి నుండి దొరల పొలాల్లో, ఇళ్ళల్లో పనులు చేయించు కునే వారు.

భారత దేశంలో నున్న ఇతర ప్రాంతాలు స్వతంత్ర వాయువులు పీల్చు కుంటున్నా తెలంగాణా బానిస బ్రతుకుల్లో మార్పు రాలేదు. కాశ్మీరు కోసం, జునాగడ్ కోసం తీరిక లేకుండా ప్రయత్నాలు చేసిన నెహ్రు, పటేల్ ద్వయం తెలంగాణా గురించి పట్టించుకోలేదు. చివరి ప్రయత్నంగా ప్రజలు సాయుధ పోరాటానికి దిగారు. మూడు వేల గ్రామాలను విముక్తం చేయగా దొరలంతా హైదరాబాదులో తల దాచుకొన్నారు. చివరికి హైదరాబాదును ముట్టడించిన తరుణంలో నెహ్రు, పటేల్ లకు హటాత్తుగా తెలంగాణా పై ప్రేమ పెరిగి పోయి మిలిటరీ ఆక్షన్ తో తెలంగాణాని భారత దేశంలో కలిపారు. తెలంగాణా ప్రజలను కష్టాలకు కారణమైన నిజాం నవాబును “His Exalted Highness” (H.E.H.) బిరుదుతో సత్కరించి ప్రజలు దోచుకుని సంపాదించిన అతని ఆస్తులని అతనికే అప్పగించారు. తద్వారా తెలంగాణా ప్రజల ఆగ్రహానికి కత్తికి కండగా కావలసిన మనిషి ప్రపంచంలో ఐదవ పెద్ద ధనవంతుడు గా మారిపోయాడు.బ్రతుకు జీవుడా అని హైదరాబాదుకి పారిపోయిన దొరలంతా రాజకీయాల్లోకి దూకి 'ప్రజాసేవకులు' గా మారిపోయి ఇప్పటికీ తెలంగాణా వారి భుజాలమీద స్వారీ చేస్తున్నారు.

1956 వరకు హైదరాబాదు రాష్ట్రం గా వున్నా తెలంగాణా మరోసారి పాలక వర్గాల కుట్రలకు బలి పశువుగా మారింది. భాషా ప్రయుక్త రాష్ట్రం ముసుగు కప్పి తెలంగాణాని మరోసారి ఉరికంబం ఎక్కించారు. పెద్దమనుషుల ఒప్పందం, ముల్కి నిబంధనలు మొదలైన వన్నీ తుంగలో తొక్క బడ్డాయి. ప్రాంతీయ అసమానతలు మరింత పెరిగాయి కాని తగ్గలేదు. డెబ్బై శాతానికి పైగా తమ పరీవాహకంలో ఉన్న నదులు పది శాతం నీరు కూడా ఇవ్వడం లేదన్న సత్యం దృగ్గోచరమైన తర్వాత తెలంగాణా మరోసారి ఉద్యమానికి దిగింది. ఈసారి ఫలితం ఎలా వుంటుందో చూడాలి.

ఇది వ్రాసే సమయానికి చిదంబరం ప్రత్యేక తెలంగాణా ప్రక్రియ మొదలు పెట్టడానికి అసెంబ్లీ లో తీర్మానం చేస్తామని ప్రకటించారు. ఇది అసంపూర్తి ప్రకటనే అయినా ఒక సానుకూల ప్రకటన గా భావించ వచ్చు.

Comments

  1. జై తెలంగాణ జై జై తెలంగాణ

    చాలా చక్కని విశ్లేషణ.

    ఇప్పుడే సంబరపడవద్దు - ఎన్ని తిరకాసులు పెట్టాలో అన్నీ పెడతారు. వాటన్నిటిని అడ్డుకుని నిలిచే ధైర్యం, శక్తి, ఓర్పు ప్రసాదించాలని తెలంగాణ ప్రజలందరిని కోరుకుంటున్నాను. ఈ ఉద్యమానికి ఊపిరి పోసిన కెసిఆర్ కు మరియు అర్థవంతంగా మలచిన విధ్యార్థులకు, మేధావులకు నా విజ్ఞప్తి ఇదే.

    జై తెలంగాణ జై జై తెలంగాణ
    జై తెలంగాణ జై జై తెలంగాణ
    జై తెలంగాణ జై జై తెలంగాణ

    ReplyDelete
  2. జై తెలంగాణ జై జై తెలంగాణ
    జై తెలంగాణ జై జై తెలంగాణ

    ReplyDelete
  3. శ్రీధర్ రాజు, రాకేశ్, తమిళన్ గార్లకు కృతజ్ఞతలు

    ReplyDelete
  4. Jai Telengana.Jai Jai Telengana

    Ali

    ReplyDelete
  5. చాలా చక్కని విశ్లేషణ.

    ReplyDelete
  6. చిరాగ్ అలీ, నాగన్న గార్లకు ధన్య వాదాలు

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...