Skip to main content

తిరుపతి లడ్డూలో బోల్టు వస్తే...


తిరుపతి లడ్డూలో బోల్టు రావడం ఈ నెలలో అప్పుడే రెండోసారి. యధాప్రకారం టీవీలో పదేపదే అదేపనిగా చూపిస్తూ చర్చలు, అభిప్రాయాలు. TTD వారిమీద భక్తుల ఆరోపణలు.

తిరుపతికి వచ్చే లక్షలాది మంది భక్తులకు సరిపడా లడ్డూలు తయారు చేయడం యంత్రాల సహాయం లేకుండా సాధ్యమయ్యే పని కాదు. ఇలా వాడుతున్న యంత్రాలు ఇరవై నాలుగ్గంటలూ పని చేస్తున్నప్పుడు చిన్నచిన్న విడిభాగాలు ఊడిపడడం కూడా అంతే సహజం. బహుళజాతి కంపెనీలు వ్యాపారం కోసం నడిపే కూల్ డ్రింకుల లోనే బొద్దింకలు వస్తున్నాయి. TTD వారి లడ్డూ తయారీ వ్యాపార దక్షతతో నడుప బడుతున్న కంపెనీ కాదు. పైగా దీనిపై వారు సబ్సిడీ కూడా ఇస్తున్నారు. అలాగని ఇలాంటి పొరపాట్లు లేకుండా చేయడం అసాధ్యమనీ కాదు. కానీ దానికి అత్యాధునికమైన యంత్రాల వాడకం, వాటికి నియమిత కాల పరిశీలన, దిద్దుబాట్లు చేయాలి. ప్రతి లడ్డూను తయారీ అనంతర పర్యవేక్షణకు గురిచేయాలి. తయారయిన లడ్డూలను సంచీలలో కట్టి బ్యాచునంబర్లను ముద్రించాలి. ఇంత చేసినా కూడా ఏమైనా పొరపాట్లు దొర్లితే బ్యాచునంబరు ఆధారంగా సంబంధిత తయారీదార్లను శిక్షించాలి. ఇంత పద్ధతిగా చేయాలంటే పెట్టుబడి, అధిక సిబ్బంది అవసరమౌతుంది. ఇవన్నీ చేసినప్పుడు లడ్డూరేటు కూడా భారీగానే పెరిగే అవకాశం ఉంటుంది. ఇదంతా భక్తుల మనోభావాలు, TTD చిత్తశుద్ధి, నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది.

ఇక పోతే లడ్డూలో బోల్టువచ్చిన భక్తుడి సంగతి. అలా వచ్చినప్పుడు భక్తుడిగా అతడి విద్యుక్తధర్మం ఏమిటి?

  1. ఏదోలే అనుకుంటూ బోల్టు పక్కకు పడేసి లడ్డూ తినెయ్యడం. ఇంకా కోపం తగ్గక పోతే TTD వారిని నాలుగు తిట్టుకోవడం.   
  2. లడ్డూలో వచ్చిన బోల్టు కూడా మహాప్రసాదంగా తలచి, దాన్ని ఇంటికి తెచ్చి దేవుడిగదిలో భద్రపరచుకోవడం.
  3. నానా యాగీ చేసి, టీవీల వాళ్లకి చూపించి TTD పై రకరకాల స్టేట్ మెంట్లు గుప్పించడం. 

పై మూడింటిలో భక్తులు ఏవిధంగా వ్యవహరిస్తే బాగుంటుందో వ్యాఖ్యల రూపంలో వ్రాయగలరా? పైమూడే కాకుండా మరిన్ని ఆప్షన్లు ఇచ్చినా ఫరవాలేదు.

Comments

  1. వాళ్ళు xray స్కాన్ చేస్తే సరి.

    ReplyDelete
  2. శేషు,
    xray scan అంటే మళ్ళీ ఎవరైనా గమనిస్తూ వుండాలి. ఆ గమనించేవాడు పక్కనోడితో హస్కు కొట్టడం మొదలట్టాడనుకోండి, మళ్ళీ సేమ్ ప్రాబ్లెమ్.
    తయారుకాబడిన లడ్డూల్ని మొదట ప్లాస్టిక్ ట్రేల్లో పెట్టి, Industrial strength metal detectors గుండా నడిపితే సరిపోతుంది. USA లో అన్ని mega food manufacturing companies పాటించే పద్ధతే యిది.

    ReplyDelete
  3. శేషు & పండు
    ఈ ఎక్సరే పధ్ధతి బాగానే ఉంది.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...