Skip to main content

బయటపడ్డ శ్రీకృష్ణ కమిటీ పక్షపాత ధోరణి

శ్రీకృష్ణ కమిటీ పక్షపాత ధోరణిపై మొదటినుండి తెలంగాణా వాదులు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బయట పడిన ఎనిమిదో అధ్యాయం లోని భాగాలు కమిటీ యొక్క దిగజారుడు తనాన్ని నగ్నంగా బయట పెడుతూ, తెలంగాణా వాడు చేస్తున్న ఆరోపణలు నిరాధారం కావని నిరూపించాయి. ఇలాంటి అధ్యాయం పై సంతకం పెట్టడం ద్వారా జస్టిస్ శ్రీకృష్ణ ఏరకమైన లాభాలు పొందారో తెలియదు కాని, తన ప్రతిష్టకు మాత్రం మాయని మచ్చ తెచ్చుకున్నారని మాత్రం చెప్పవచ్చు.

సాధారణంగా ప్రభుత్వరంగ సంస్థల్లో తమకిష్టం లేని యూనియన్ లీడర్లను శిక్షించడానికి మేనేజిమెంట్లు తమకి మడుగులోత్తే తొత్తులైన ఆఫీసర్లతో ఎంక్వయిరీలు వేయించి తమకు అనుకూలంగా రిపోర్టులు రాయించుకుని పెద్ద పెద్ద శిక్షలు విధిస్తుంటారు. ఇవి ఎలాగూ లేబర్ కోర్టులలో వీగి పోతుంటాయి. కొండొకచో అలాంటి ప్రవర్తనకు దిగిన అధికారులకు చీవాట్లు కూడా పడుతుంటాయి. కాని ఇక్కడ ఎంక్వరీలు చేసే ఆఫీసర్లు కాని, శిక్షలు విధించే మేనేజర్లు కాని న్యాయ కోవిదులు కారన్న విషయం గమనార్హం.

దేశంలో పేరొందిన న్యాయమూర్తిగా వెలుగొందిన జస్టిస్ శ్రీకృష్ణ ఒక సాధారణమైన లాలూచీ అధికారి మాదిరిగా ప్రవర్తించడం చిత్రమైన విషయం. ఆయన ఎనిమిదో అధ్యాయం లో పేర్కొన్న విషయాలు చూస్తే ఉద్యోగభయంతో మేనేజిమెంటుకు కావలసిన దొంగరిపోర్టులు రాసే సూపర్ వైజరు స్థాయికి ఏమాత్రం మించని వ్యక్తిత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.   

తెలంగాణా ఏర్పాటు అడ్డుకోవడానికి అవి పొలిటికల్ మేనేజిమెంటు, మీడియా మేనేజిమెంటు చేయాలని సూచించారు. రాజకీయ నాయకులను పదవులతో కొనాలట! అవసరమైతే సీయం, డిప్యూటీ సీయం పదవులు ఇవ్వడానికి కూడా ఇవ్వడానికి వెనుకాడ వద్దట! కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉద్యమంలోకి రాకుండా కట్టడి చేసి, ఉద్యమాన్ని అణచి వేయాలట!

ఒకవైపు అణచివేత సాగిస్తూనే ఇంకోవైపు తెలంగాణా ఏర్పాటు కోసం విస్తృతమైన చర్చలు జరుపుతున్నట్టు నటించాలట! రాజకీయ నాయకులకే పాఠాలు నేర్పుతున్న జస్టిస్ శ్రీకృష్ణ ప్రత్యక్షరాజకీయాల్లో లేనందుకు మనం సంతోషించాలేమో! 

ఇక పోతే ఆయనగారు ఉద్భోధించిన మీడియా మేనేజిమెంటు అత్యంత హేయమైన విషయం. ప్రజాస్వామ్యం పై ఏమాత్రం గౌరవం ఉన్నవాడైనా తుపుక్కున ఉమ్మేసే విధంగా ఉన్నాయి కమిటీ సూచనలు! మీడియాలో దాదాపు అందరూ సీమాంధ్ర వారే ఆధిపత్యం చేలాయిస్తున్నారు కాబట్టి, వారందరి సంయుక్త కార్యాచరణ ద్వారా సామాన్యమానవుడి విచక్షణాశక్తిని మసిపూసి మారేడుకాయ చేయాలట! ఇంతటి దారుణమైన ఆలోచనలు మువామ్మార్ ఖడ్డాఫీకి, హోశ్ని ముబారక్ కి కూడా వచ్చి వుండవు.

గతంలో శ్రీకృష్ణ గారు ఇచ్చిన నివేదికలతో తాజా నివేదికను పోలిస్తే పనిచిన పని చేసినట్టుంది కాని, స్వీయ విచక్షణ చూపినట్టు ఏమాత్రం లేదు. మరి పనిచినవాడు చిదంబరుడా మరొకరా అన్నదే ఇప్పుడు తేలాల్సిన సమస్య.

ఇదంతా చూస్తుంటే ఎనభైలలో వచ్చిన తెలుగు మూస సినిమాలు గుర్తుకు వస్తున్నాయి. అప్పట్లో రావుగోపాలరావు, అల్లురామలింగయ్య విలన్లుగా ఉండే వారు. హీరోని అడ్డగించ డానికి రకరకాల తెలివి తక్కువ కుట్రలు పన్నుతూ, అవి బయట పడి శృంగభంగం చెందుతూ ఉండే వారు. ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు నడ్డగిస్తున్న వారు తమ లేకితనాన్ని ఎప్పటికప్పుడు బహిర్గతం చేసుకుంటూ ఒక విధంగా తెలంగాణా ఉద్యమాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహదం చేస్తున్నారు. 

The Judgement given by Hon'ble Mr Justice L. Narsimha Reddy can be viewed here.
http://hc.ap.nic.in/orders/wp_1569_2011.html

Comments

  1. Veeraadhi veera andhra blaagarulara....

    Rozu vandaladiga comments rastaarugaa, ee post chadavikooda ekkada daakkunaaru chepmaa?
    Sasemira antunnaara...

    Deenitho prove ayiindendante, mounanga unde medhavi blaagarlaku, LSP neta JP ki teda ledu!!

    ReplyDelete
  2. Anno eda okka comment raale inka. Andharu padukunnara endhi ? Ayina raseki emunnadhile antha kulla kulla kanapaduthandhi kadha.

    ReplyDelete
  3. జస్టిస్ శ్రీకృష్ణ కాదు ఛీకృష్ణ:)

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...