Skip to main content

నల్ల జీవో

ప్రభుత్వం తాజాగా GO నెంబర్ 177 విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగులు ప్రభుత్వంపై నిరసన తెలుపడానికి అనుసరించే పద్ధతులైన సమ్మె, టూల్ డౌన్, పెన్ డౌన్ తదితర ప్రక్రియల నిషేధిస్తూ నో వర్క్, నో పే అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తామని చెప్పడం జరిగింది.

ఒక సందేహమేమిటంటే, ఇప్పటివరకూ పనిచేయక పోతే కూడా జీతాలిస్తున్నారా అని. పని చేయక పోటే ఎక్కడా జీతాలు ఉండవ్. అయితే సదరు ఉద్యోగి పనిచేయలేదని నిర్ధారించవలసి ఉంటుంది. దానికి కొంత ప్రక్రియ ఉంటుంది. 

పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు. అనుకున్నా అది ఇప్పటికే ఉన్న నిబంధనల వాళ్ళ సాధ్యం కాదు. కాని ప్రభుత్వం పై నిరసన తెలియజేయడానికి మాత్రం ఉద్యోగులు ఇలాంటి ప్రక్రియలను ఉపయోగించడం మామూలే.

ఇలాంటి జీవోలవల్ల ప్రభుత్వం ఏక పక్షంగా నిర్ణయం  తీసుకోవచ్చు. ఉద్యోగుల జీతాలు ఆపి వేయవచ్చు. ఇదేమని ఎవరైనా అడిగితే జీవో కాపీలు చూపిస్తారు.

ఇకపై ప్రభుత్వం ఎలాంటి ఉద్యోగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా, జీతాలు పెంచక పోయినా నిరసనలు తెలప కూడదన్న మాట. కేవలం విఙ్ఞప్తులు మాత్రమే చేసుకోవాలి. వింటే వింటారు, లేకపోతే లేదు.

నిజమే, ప్రైవేటు ఉద్యోగాల్లో సమ్మెలకు ఎక్కువ వెసులుబాటు ఉండదు. అయితే ప్రైవేటులో ఉన్న పోటీ తత్వం వల్ల నిపుణులైన ఉద్యోగులను  కాపాడుకోవడానికి ఎప్పటికప్పుడు వేతనాలను సమీక్షిస్తుంది. అదికూడా నిపుణులైన వారికి మాత్రమే. 

ఇక ప్రభుత్వం విషయానికి వస్తే, మన ప్రజా ప్రభుత్వాలకు ఉన్న జవాబుదారీ తనం ఎంతో పేపరు చదివే ప్రతి ఒక్కరికీ తెలుసు. తాము ఇచ్చిన GOలు ప్రజలకిచ్హిన వాగ్దానాలు, అవినీతి ఆరోపణలు, కోర్టు మొట్టికాయలు ఇలా ఎన్నని చెప్పలి? దేనికి స్పందించకుండా యధేచ్చగా తమ దోపిడీ యఙ్ఞాన్ని మాత్రం నిర్విఘ్నంగా కొనసాగిస్తాయి మన ప్రభుత్వాలు.

అలాంటిది ఇక ప్రభుత్వ ఉద్యోగుల గోడు పట్టించు కునేదెవరు? రాష్ట్ర చరిత్రలో  ఉద్యోగులు సమ్మె చేయకుండా ఎన్నిసార్లు pay revision జరిగింది? ఎన్నిసార్లు వారి న్యాయమైన కోర్కెలకు పరిష్కారం లభించింది? ప్రభుత్వం తన బాధ్యతలు తాను సక్రమంగా నిర్వర్తిస్తే సమ్మెలు చేసేవారెవరు?

మధ్య యుగాల నాటి బానిస చాకిరీల విముక్తికై ఎన్నో త్యాగాలతో కూడిన పోరాటాలు చేసి సంపాదించుకున్నది సమ్మె హక్కు. అలాంటి హక్కును, ILO స్పూర్తికి విరుద్ధంగా ఒక్క కలం పోటుతో హక్కులను కాలరాచే ప్రయత్నం చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. బహుషా బ్రిటిష్ ప్రభుత్వం కూడా ఇలాంటి GO ఇచ్చే సాహసం చేసి ఉండదు.

ప్రజల్లో reforms తీసుకు రావాలనుకునే ముందు ప్రభుత్వం తాన పద్ధతులను ముందు సవరించుకోవాల్సి ఉంటుంది. 610 జీవో విడుదల చేసి పాతికేళ్ళు దాటినా, ఇప్పటివరకూ అమలుకు నోచుకోలేదు. నిర్నయాలు, నియామకాలు, వాగ్దానాల అమలు, ఇలా ప్రతి దానిలోనూ అవకతవకలే. 

ఇంతటి అవక తవకలతో కూడిన ప్రభుత్వం తనపై మాత్రం ఎవ్వరూ నిరసన తెలుపకూడదని చెప్ప బూనడం నియంతృత్వం తప్ప మరోటి కాదు. ఈ GO కేవలం ఒక ప్రాంతం వారికే వ్యతిరేకంగా ఉందని కొందమంది అప్పుడే చంకలు గుద్దుకోవడం మొదలు పెట్టారు. కానీ, భూతాన్ని తయారు చేసి వదిలాక అది ఎవరినైనా మింగుతుందని ప్రతి ఒక్కరూ భావించాలి.               


Comments

  1. పని చేయకుండా వేతనం తీసుకోవాలని ఎవరూ అనుకోరు.

    Idi nenu asalu nammanu,andulo government jobs lo prati okkadu pani cheyyakunda jeetam teesukovali anukoe valle ekkuva.
    Inka cheppalante chesina paniki lancham kuda expect chestaru ga.
    ivi nenu vini telusukonnavi kadu,experience.
    I saw corruption every where in the government employees.
    teachers ayte okka sign pettesi velli vadi own school lo no,lekapote vere private school lo no patalu cheptadu.
    i have a friend in irrigation department,everday he will get lancham.
    vadu danni goppaga cheppukontadu,teesukoka pote kudaradu,evari vata vallaki vuntundi ani.
    naku ayte cheppu teesukoni kottalanipistundi.
    chese job ki responsibility feel avvam kani,rights matram kavali.
    evadyna kastapadi government job techu konte chalu,aa tarvata kastapada akkarledu anukone vade.
    deenni batti ardam avutundi ga government job chese vallu entha baga chestunnaro.

    ReplyDelete
  2. @అనానిమస్

    కరప్షన్ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉంది, వారి పై ఆఫీసర్లలో, రాజకీయ నాయకుల్లో అంతకన్నా ఎక్కువే ఉంది.

    కరప్షన్ ఆపడానికి శిక్ష ఈ జీవో అంటారా కొంపదీసి? మరి అంతకన్నా ఎక్కువ కరప్షన్ చేసే ఐఏస్, ఐపీఎస్, మినిష్తర్లకు ఏం షిక్ష విధిద్దాం?

    గాయం ఒకచోట ఉంటే మందు ఇంకో చోట పెడితే ప్రయోజనం ఏముంది?

    ReplyDelete
  3. అవినీతి ఎందుకు ఉందంటే "తమ ఇల్లు చక్కబెట్టుకుంటే చాలు, సమాజం ఏమైపోతే మనకేమిటి" అనుకునే narrow minded ideas వలన. అటువంటి narrow minded ideasని విమర్శించకుండా ప్రభుత్వ ఉద్యోగులందరూ లంచాలకోర్లు అంటే ప్రయోజనం ఉండదు. చంద్రస్వామి ప్రభుత్వ ఉద్యోగి కాదు. అతను ఎన్ని మోసాలూ, ఫోర్జరీలూ చెయ్యలేదు? అతను ప్రభుత్వ ఉద్యోగిలాగ వెయ్యి, రెండు వేలు లంచం తీసుకోలేదు. లక్షలు, కోట్లు తీసుకునేవాడు. మిడిల్ క్లాస్ వ్యక్తి పది వేలు రూపాయలు మింగితే డబ్బున్నవాడు పది కోట్లు రూపాయలు మింగగలడు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

మనిషి దేవుడెలా అవుతున్నాడు?

మనిషి సంఘ జీవి. రాను రాను సంఘ జీవనానికి కొన్ని నియమాలు అవసరమయ్యాయి. అవే నియమాలు సమస్యలనూ సృష్టించాయి. ఆ సమస్యలను ధైర్యంగా ఎదుర్కునే వారు కొందరు, ఇతరుల సహాయం కోరే వారు కొందరు. ఇలా ఉపదేశాలు తీసుకోవడం మొదలైంది. మనుషులలో కొందరు తెలివైన వారు ఉంటారు. వీరు తమ విజ్ఞానంతోనో, అనుభవంతోనో, మాటకారితనంతోనో ఇతరులను ప్రభావితం చేయ గలరు. అలాంటి వారు ఇతరులకి ఉపదేశాలివ్వడం మొదలు పెట్టారు. ఇలాంటి గురువులు మనకు పురాణాల్లో కొల్లలుగా కనబడతారు. మన పురాణాల్లో మహా మహిమాన్వితులు, గొప్పవారైన గురువులు లేదా ఋషుల గురించి చర్చించడం జరిగింది. చాలా సార్లు వారు దేవతలనే శపించగల శక్తివంతులుగా చిత్రింప బడ్డారు. కాని ఎక్కడా వారే దేవతలని చెప్పబడలేదు. వారు అలా ప్రకటించుకోలేదు కూడా. కానీ ఈరోజుల్లో వీధికొక బాబా నేనే భగవంతున్నని ప్రకటించుకోవడం లేదా తన శిష్య బృందంతో అన్యాపదేశంగా అనిపించుకోవడం సర్వ సామాన్యంగా మారి, మనకందరికీ దాదాపుగా అలవాటై పోయింది. ఒకప్పటి సప్తర్షులు, వారి శిష్య ప్రశిష్యులు కూడా భగవస్వరూపులు కాలేనప్పుడు, మరి ఈనాటి వీధి బాబాలు ఎలా ప్రత్యక్ష దైవాలు కాగలుగు తున్నారో ప్రతి ఒక్కరు ఆలోచించ వలసిన విషయం. ఆలోచిస్తే...

రాక్షస సంహారం పూర్తయిందా?

మతోన్మాదాన్ని నిండుగా తలకెక్కించు కుని రాక్షసత్వాన్ని సంతరించుకున్న ఒక మహా క్రూరుడు చివరకు హతమయ్యాడు. రాక్షసుడు మరణించి నందుకు పండుగలు చేసుకుందామా? నిజమే, చేసుకోవచ్చు. ఒక వేళ ఆ రాక్షసుడిని సంహరించింది ఒక అవతార పురుషుడైతే అలాగే సంతొషించ వచ్చు. ఇకపై శాంతి వెల్లివిరుస్తుందని ఆశించవచ్చు.  కానీ వాణ్ని అంతకంటే మదించిన ఇంకో బ్రహ్మరాక్షసుడు సంహరించితే సంతొషించడానికి ఏం వుంటుంది? రాక్షసుడు సంహరించ బడ్డందుకు సంతోషించాలా, లేక బ్రహ్మరాక్షసుడిని ఇక ఏమాత్రం ఎదురొడ్డే వాడు లేడని భయపడాలా? ఈ క్షణం ప్రపంచం లోని ఆలోచనా పరులను వేధిస్తున్న ప్రశ్న ఇదే. అసలు ఈ రాక్షసుణ్ణి తయారు చేసింది ఎవరు? ఆ బ్రహ్మ రాక్షసి కాదా? ఆ రోజు సోవియట్ యూనియన్ విచ్చిన్నం అవసర మైన రోజు దేవదూతగా కనిపించిన వాడు నేడు తన దాకా వచ్చేసరికి రాక్షసుడు గా మారాడు. రాక్షస సంహారం జరిగినందుకు అమెరికా అంతటా సంబరాలు జరుగు తున్నాయట. సంతోషమే. కానీ అదే అమెరికా ప్రజలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటుంది. తమ దేశ ప్రభుత్వం సామ్రాజ్య వాద, వలస వాద ధోరణులను విడనాడక పొతే విధ్వంసం ఈ లాడెన్ తో అంతం కాదు. ఇలాంటి లాడెన్లు ఎందరో పుడుతూనే ఉంటారు, అమెరికా ...