Skip to main content

రాబోయే ముఖ్యమంత్రి ఎవరు?

ఇప్పుడు బరిలో ఉన్న ముఖ్యమైన పార్టీల గుణగణాల పై ఒక పరిశీలన.

  1. కాంగ్రెస్ పార్టీ: ప్రస్తుతం ఈ పార్టీ తో ఏ ఇతర ప్రముఖ పార్టీ చేతులు కలపడానికి భయపడుతుంది. కారణం (ఎన్ని అభివృద్ది పనులు చేసినప్పటికి) ఈ ఐదు సంవత్సరాల్లో ఆ పార్టీనేతల కుంభకోణాలే. ఈ పార్టీ పాలనలో జలయజ్ఞం, రెండు రూపాయలకు కిలో బియ్యం, ఉచితవిద్యుత్తు మొదలైన కార్యక్రమాలు ఎంతో కొంత అమలైన మాట వాస్తవం. వీటి వల్ల లబ్ది పొందినవారు ఈ పార్టీ కే వోటు వేయడం సహజం. అయితే ఆలోచనా శీలురైన ప్రజలు ఈ పార్టీ అవినీతిపనులను ఎంతవరకు సమర్థిస్తారు అనే విషయం వేచి చూడాల్సిందే.
  2. తెలుగు దేశం - మహా కూటమి: ఈ కూటమి ప్రస్తుతం కాంగ్రెస్ కుంభ కోణాలను ఎండగట్టడంలో తల మునకలై ఉంది. ఇది మంచి వ్యూహమే ఐనప్పటికీ గతంలో చంద్ర బాబు పాలనలోనిఅవినీతి, కుంభ కోణాలు ఒక పెద్ద మైనస్ అయ్యే అవకాశం ఉంది. అంతే కాక వీరు ఎంత సేపు వీరుఅవినీతి పై పోరాటం సాగిస్తున్నా మంటున్నారు కాని, అధికారం లోకి వస్తే నీతివంతమైన పరిపాలనకోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పడం లేదు. దానికి తోడు తెలంగాణా ఇవ్వాలా వద్దా అనే వాదోప వాదాలు ఎలాగూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ వ్యతిరేకులకు ఈ కూటమి బలమైనప్రత్యామ్నాయంగా కనిపిస్తుందనటం లో అతిశయోక్తి లేదు.
  3. ప్రజా రాజ్యం: కొత్త గా పెట్టబడిన ఈ పార్టీ చిరంజీవి గ్లామర్ పై పూర్తి గా ఆధార పడింది. సామాజిక న్యాయం, సామాజిక తెలంగాణా అనే నేతి బీరకాయలను ప్రధాన పాలసీగాచెప్పుకుంటుంది. ఇప్పటివరకు నిర్మాణం జరిగిన పార్టీ పలక వర్గంలో ఆ పార్టీ చెప్పే 'సామాజికన్యాయం' ఎక్కడా కనపడ్డం లేదు. అందుకే నేతి బీర కాయ అనవలిసి వచ్చింది. ఈ పార్టీ మరోఅస్త్రం కాంగ్రెస్, టీడీపీ ల అవినీతి. అయితే ఈ పార్టీ కుడా తాము అధికారం లోకి వస్తే అవినీతినిఎలా నిర్ములిస్తారో, దానికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పడం లేదు. ఎన్నికల్లో మద్యం, డబ్బు వినియోగించమని హామీ ఇవ్వటం లేదు. పైగా అన్ని పార్టీల 'ఘనాపాటీ' లను అక్కున చేర్చుకుంటున్నారు. పురిటి లోనే బంధు గణాలకు పెద్ద పీట వేసిన ఏకైక పార్టీ గా పెరుమోసింది. అయితేఇవన్నీ ఆలోచించే సమయం లేని ప్రజలు ఈ పార్టీకి కుడా పెద్ద పీట వేస్తారనటంలో ఆశ్చర్యం లేదు.
    ఈ పరిస్థితి లో మూడు కూటములకు దాదాపుగా సమానమైన సీట్లు వస్తాయని అనిపిస్తుంది. అంటే ప్రతి కూటమికి 90 నుండి 110 మధ్యలో సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది హంగ్ అసెంబ్లీ కి దారి తీయవచ్చు. ఆ పరిస్థితిలో చిరంజీవి, చంద్ర బాబు చెరి రెండున్నర సంవత్సరాలు ముఖ్య మంత్రి పదవిలో ఉండవచ్చు. ముందు చిరంజీవికి అవకాశం దక్కితే రెండున్నరేళ్ళు చేస్తాడు. చంద్రబాబు కి దక్కితే?

Comments

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. >> "చంద్రబాబు కి దక్కితే?"

    ఆ పరిస్థితే వస్తే, పదవి చంద్రబాబుకే దక్కుతుంది. ఎందుకంటే తెరాస, కమ్యూనిస్టుల మద్దతూ అతనికే + వాళ్లకీ ఎన్నో కొన్ని సీట్లొస్తాయి కాబట్టి. బాబొక సారి ముఖ్యమంత్రయ్యాక ప్రరాపా గతేమవుతుందో ఊహించటం కష్టం కాదు.

    ఐనా, మీరు 'సపోర్ట్ లోక్ సత్తా' అని పేరెట్టుకుని మిగిలినోళ్లలో ఎవరు ముఖ్యమంత్రవుతారనే దాని మీద చర్చ లేవదీయటం ఏంటో :-)

    ReplyDelete
  3. అబ్రకదబ్ర గారి వ్యాఖ్య కి ధన్య వాదాలు.

    లోక్ సత్తాను సపోర్ట్ చేయడమే ఉద్దేశమైనప్పటికి సమకాలీన రాజకీయాలు చర్చించడంలో తప్పులేదనుకుంటాను. లోక్ సత్తాను సపోర్ట్ చేస్తున్నప్పటికీ, ఈ ఎన్నికలలో లోక్ సత్తా ముఖ్య మంత్రిని చూస్తామనే భ్రమలో లేను. అయితే ఆ వైపుకు జనం చైతన్య వంటమవ్వాలనేదే కోరిక, ఈ బ్లాగు లోని ప్రతి పోస్ట్ లో కుడా అంతర్లీనంగా ఉండే భావం కుడాను. విజ్ఞులంతా ఈ చర్చలో పాల్గొనాలనేదే నా కోరిక.

    ReplyDelete
  4. చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వడానికి రెండు రకాల అవకాశాలు ఉన్నాయి.

    ఒకటి సొంతంగా మెజారిటీ సాధించడం - ఇది కష్టమే అయినా ప్రజల మనసులో ఏముందో ఎవరూ చెప్పలేము.

    రెండోది హంగ్ అసెంబ్లీ - ఇది చాలా వరకు సాధ్యం. ఈ సందర్భంలో వై ఎస్ లేక చంద్రబాబు చిరంజీవికి మద్దతు ఇచ్చి ముఖ్యమంత్రిని చెయ్యవచ్చును. ఎందుకంటే వై ఎస్, చంద్రబాబు ఒకళ్ళనొకళ్ళు నమ్మరు కాబట్టీ.

    ఇక వై ఎస్ లేక చంద్రబాబు సొంతంగా మెజారిటీ తెచ్చుకొంటే వాళ్ళే ఎలాగూ ముఖ్యమంత్రి అవుతారు.

    ReplyDelete

Post a Comment

బ్లాగుపై మీ అభిప్రాయాలు,సూచనలు, సలహాలకు ఆహ్వానం.
దయచేసి సభ్యత లేని వ్యాఖ్యలు తొలగించ బడతాయని గమనించ గలరు.

Popular posts from this blog

వాదోప వాదాలు

ఈ మధ్యన వినిపిస్తున్నన్ని వాదాలు ఇదివరలో ఎప్పుడూ వినలేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక వాదాన్ని తలకెత్తుకుని వాదించే వారే! అసలు ఈ వాదాలు ఏమిటి, ఎందుకు అని ఒకసారి ఆలోచిద్దామనిపించింది. అసలు ఫలానావాదం అంటే ఏమిటి? తమ వాదనకు పెట్టుకునే పేరు. సామ్యవాదం అంటే అర్థం చేసుకోవచ్చు. అందరు మనుషులూ సమానంగా ఉండాలని చెప్పేదే సామ్యవాదం. అందరు మనుషులూ సమానంగా ఉండాలి సరే, మరి అందరూ సమానంగా పనిచేయాలా వద్దా? వివరాలకు వెళ్ళితే అలా పని చేయక పోయినా ఫరవాలేదని చెప్పేదే కమ్యూనిజం. ప్రతి ఒక్కరు చేయగలిగినంత పని, ప్రతి ఒక్కరికి తినగలిగినంత తిండి, స్థూలంగా ఇదే కమ్యూనిజం. మరి ఎవరైనా అస్సలు పని చేయక పోతే ఎలా? అనే ప్రశ్నకు ఇంతవరకు సంతృప్తి కరమైన సమాధానం దొరకలేదు.  ఈ మధ్య సరేసరి. తెలంగాణావాదం, సమైక్యవాదం జనం రోజూ నోళ్ళలో నానుతున్న పదాలు. వీటి గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి వేరే చెప్ప నక్కరలేదు. ఇకపోతే హిందుత్వ వాదం. హిందువుల ఆత్మ గౌరవం, హిందూ జాతి పరిరక్షణ, హిందువుల హక్కులు etc etc అని అర్థం చేసుకోవచ్చు. కొండొకచో ముస్లిం, కిరస్తానీ వ్యతిరేకత అనే అభిప్రాయం కూడా వుంది. హిందుత్వ అనగానే గుర్తొచ్చేది లౌకికవాదం. దీని గ...

బ్లాగోగులు

ఈ రోజు నేను రెండు పోస్టులు పెట్టాను. మొదటిది అవినీతి గురించి నాకు తోచిన రెండుముక్కలు రాస్తూ, అలాగే అన్నా హజారేకి మద్దతు పలకాలన్న సందేశంతో కలిపి రాసాను. తర్వాత యధాలాపంగా గూగుల్ అనాలిటిక్స్ చూస్తుంటే, వాడు కాశ్మీరు, అరుణాచల్ ప్రదేశ్ లేని ఇండియాను చూపెట్టే సరికి, చిర్రెత్తుకొచ్చి దానిపై ఒక పోస్టు పెట్టాను.  మొదటి దానికి 'అవినీతిపై యుద్ధం' అని పేరు పెట్టాను. రెండోదానికి 'గూగుల్ నిర్వాకం' అని పేరు పెట్టాను.  ఓ నాలుగ్గంటల తర్వాత రెండింటికి వచ్చిన హిట్ల వివరాలను చూస్తే ఇలా ఉన్నాయి. గూగుల్ నిర్వాకాన్ని 172 మంది చూడాలనుకుంటే, అవినీతి పై యుద్ధంలో పాలు పంచుకోవడానికి కేవలం నలభై అయిదు మండే ముందుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏమంటే క్లిక్కేంత వరకూ నేనేం రాసానో అది చదవొచ్చో, కూడదో ఎవరికీ తెలియదు. కేవలం హెడ్డింగును చూసే ఎవరైనా తెరిచి చూస్తారు.  దీన్నిబట్టి అవినీతి గురించి జనం పెద్దగా పట్టించుకోవటం లేదేమో అనిపిస్తుంది. అవినీతి హెడ్డింగుతో ఈరోజే టపా రాసిన ఇంకో మిత్రుడికి కూడా ఇదేగతి పట్టి ఉంటుందనిపిస్తుంది.  ఇందుకేనేమో, కొంతమంది బ్లాగర్లు విచిత్రమైన హెడ్డింగులతో టపాలు వేస్తుంటా...

శవ రాజకీయాలు

అనుకోని సంఘటన జరిగింది. రాష్ట్ర ముఖ్య మంత్రి అత్యంత దారుణ మైన పరిస్థితిలో పరమ పదించారు . రాష్ట్రం మొత్తం విషాదంలో మునిగిన సమయంలో మన మంత్రుల ముఖాల్లో విషాదం కంటే రాజకీయం పాలే ఎక్కువగా కనపడ్డం చాలా విషాద కరమైన విషయం. ఇంతకీ వీరు చెప్పేదేమిటి? జగన్ ముఖ్య మంత్రి కావాలని. కారణం... రాజ శేఖర్ రెడ్డి గారు ఎన్నో ప్రాజెక్టులను మొదలు పెట్టారు. వాటిని పూర్తి చేయడానికి జగన్ అయితే బాగా ఉంటుందట! అప్పుడే సంతకాలతో యాభై మంది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మొయిలీకి పత్రం సమర్పించారు. మొత్తం 120 సంతకాలున్నాయని చెప్పినప్పటికీ వచ్చింది మాత్రం యాభై మంది మాత్రమే అని వార్త. ఇంతకీ ప్రాజెక్టులు పూర్తి కావడానికి జగన్ ఎందుకో? ప్రాజెక్టులు పూర్తి చేయగల ప్రత్యేకమైన క్వాలిఫికేషన్లు అతని దగ్గర ఏమున్నాయో అర్థం కాదు! కొంప దీసి ప్రాజెక్టుల వెనుక ఉన్న మతలబులు సజావుగా కొనసాగడానికి అని కాదు గద! తమ కిష్ట మైన వారిని ఎవరి నైనా ముఖ్య మంత్రిగా ఎన్నుకునే హక్కు కాంగ్రెస్ ఎమ్మెల్యేల కుంది. వారు నిరభ్యంతరంగా జగన్ నే ఎన్నుకోవచ్చు... లెజిస్లేచర్ పార్టీ మీటింగులో. ఒక వైపు సంతాప దినాలు పూర్తి కాక మునుపే ఎందుకా తొందర? దీన్ని బట్టే ఉహించు ...